ప్రత్యక్ష ప్రసారం - LIVE STREAMING

About Us

హిందూధర్మ అంతరాత్మను ధ్వనింప జేయుటయే ఈ పాంచజన్య సూక్తి అను ఆకాశవాణి సదుద్దేశము .” ప్రధానముగా ” సర్వేజనాః సుఖినో భవంతు కోరుతూ ప్రాతః వేళ భానూదయములా ఈ హిందూధార్మిక ఆశయము ఆచరణాత్మకముతో మీ సమ్ముఖమునకు వచ్చుచున్నది. ఈ హైందవ కాంతి వెలుగు సనాతనము ఋషి మార్గము హిమవత్ శిఖరమునుండి ప్రవహించుచు వచ్చు గంగలా పాంచజన్యవాణి సప్తాశ్వరుడుడగు సూర్యునిలా ఈ ఆకాశవాణి కొనసాగుతోందని సవినయముగా ముకుళిత హస్తములతో విన్నవించుకొనుచున్నాను.

శ్రీవల్లూరి రమేష్ గారు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి భారతదేశానికి అచంచలమైన దేశభక్తి తో, పరిపూర్ణమైన భగవద్భక్తితో, ఎనలేని విశ్వాసంతో, దృఢదీక్షతో అందిస్తున్న అద్వితీయమైన శ్రవ్యప్రసారమాధ్యమము.
పాంచజన్యము శ్రీ కృష్ణ భగవానుని దివ్యశంఖం. ఆశంఖధ్వని మహామహిమోపేతము. పరబ్రహ్మ తత్త్వప్రతీక అయిన ప్రణవ నాదానికి ప్రతిరూపం. భక్తులకు మనోరథప్రదాయకము. దుష్టులకు భయకంపనహేతుకము. భిదురఘోషజనకము. సజ్జనులకు హితప్రదాయకము. సర్వాస్తికజనమనోహరము.

అలాగే శ్రవ్యప్రసారమాధ్యమములలో భారతీయుల ఆకాశవాణికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కథలైనా, శ్రవ్య నాటికలైనా, వార్తలైనా, లోకాభిరామాయణమైనా, మధురభక్తిగీతాలైనా, ఆధ్యాత్మిక కీర్తనలైనా, స్తోత్రాలైనా, ఉపన్యాసాలైనా, కవితలైనా, పద్యకవిత్వమైనా అన్నింటా ముందు నిలిచేది తెలుగు వారి ఆకాశవాణి.అదే బాణీలో ఇప్పుడు ఈ పాంచజన్యవాణి.

భారతీయ ధర్మబోధలను దశదిక్కుల వినిపింపచేయడానికి, భారతీయ సంస్కృతి విశిష్టత ను విశ్వమంతా చాటి చెప్పడానికి, భారతీయ గానకళావైభవాన్ని ప్రపంచవిపంచికాస్వరాలకు జోడించాలని భారతీయ సాహిత్యగరిమను, తెలుగు భాషా, వాఙ్మయ మాధురులను మానవాళికి అంతటికీ చవి చూపించాలని భారతదివ్యదేవీ,దేవతలపట్ల భారతీయుల స్థిరమైన భక్తి తత్పరతను ఆధ్యాత్మిక భావసంపదను జగత్తుకు అందించడానికి అవతరించిన
మహనీయ, కమనీయ విశ్వవేదిక పాంచజన్యవాణి.
సర్వ జనవిధేయుడు
వల్లూరీ సీతా రమేశ్
Atlaanta ( USA )

 

 

ENGLISH TRANSLATION:

This pantheistic wish is basically to come to your senses as you seek the Surjana Janak Sukhino Building. The light of this Hindu light is eternally the path of the Rishi, flowing from the snowy peak of the Ganges.

Srivalluri Ramesh is a unique audio medium from the United States to India with unwavering patriotism, absolute devotion, unwavering confidence and determination.

Panchajanyam is the divine branch of Lord Krishna. Ahhhhhh. A replica of the Pranava Nada, the philosophical principle of Parabrahma. Devotional to the devotees. The wicked are terrifying. Bhiduraghosajanakamu. Beneficial to the sageners. Sarvastikajanamanoharamu.

The Indian skyline has a special place in the media as well. Stories, audiotapes, news, lokabhiramayana, melodrama hymns, spiritual hymns, hymns, speeches, poems, and poetry are all the forerunners of Telugu Telugu sky.

Indian dharmabodhalanu dasadikkula vinipimpaceyadaniki, declaring the entire universe of unique Indian culture, Indian ganakalavaibhavanni prapancavipancikasvaralaku Indian sahityagarimanu adding, Telugu language, to show he had all of mankind bharatadivyadevi vanmaya Madhuri, devatalapatla to give the Indians the world and became a steadfast devotion absentmindedness spiritual bhavasampadanu.

Mahoney, Kamanya is a universal Panchajanya Vani.
All-wise
Valluri Sita Ramesh

Atlaanta ( USA )

Call Now ButtonScroll Up